రెండోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మంత్రి అడ్లూరి

కలం, జగిత్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత  పార్టీ కార్యకర్తలపై ఉందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) అన్నారు. బుగ్గారం మండలంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను వివిధ గ్రామాలకు బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించగా వారికి నియామక పత్రాలను ఆదివారం బుగ్గారం మండలం శేకల్ల గ్రామంలో మంత్రి అందజేశారు.

బీఆర్ఎస్‌పై ఆగ్రహం..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడ్లూరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల చేసిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతారని భావించామని.. అయితే అసెంబ్లీకి రాకుండానే ప్రజా సమస్యలపై చర్చించకుండా రాద్ధాంతం చేసి బయటికి వెళ్లారని అన్నారు.

త్వరలో మరో రెండు గ్యారెంటీలు..

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని రానున్న రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ధర్మపురి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురిలో మూతపడిన నైట్ కళాశాలను తెరిపించడంతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రోళ్ళవాగు ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేస్తామని రంగధాం పల్లి చెరువు కూడిక దయతో పాటు యశ్వంతరావుపేట చెరువు కూడిక తీసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

పుష్కరాలకు భారీగా నిధులు..

గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకు వస్తున్నామని ఇప్పటికే ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గానికి గోదావరి పుష్కరాలకు రూ, 117 కోట్లు కేటాయించిందని అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ధర్మపురి కి బస్ డిపో సాధించడంతోపాటు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

విస్తృత ప్రచారం చేయాలి..

రాష్ట్రంలో నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలని మంత్రి కోరారు. బుగ్గార మండలం సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గారం మండలంలోని 56 మంది లబ్ధిదారులకు రూ. 15,54,400 విలువైన చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాగంగి నందయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, బుగ్గారం మండల పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ జెడ్పిటిసి బాదినేని రాజేందర్, శేకల్ల సర్పంచ్ రమేష్ సకల, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సుభాష్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>