వారిని వదిలేది లేదు.. హరీశ్ రావు మాస్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు (Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో22ఏ భూముల అంశంపై పోరాతున్నందుకే తమను టార్గెట్ చేశారని.. దీనిపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోరాటాలు తమకు కొత్తేమీ కాదన్న హరీశ్.. మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టినవారిని వదిలే ప్రసక్తే లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ లో ఆదివారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు..

రేవంత్ పాలనతో ఆంధ్రాకు నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు కన్నీళ్లు మిగిలాయని హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా నదిలో నీళ్లు చంద్రబాబు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. కావాలనే రేవంత్ రెడ్డి కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయకుండా నీళ్లనుకిందికి వదులుతున్నాడని ఆరోపించారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌కు పాలనా చేతకావట్లేదు..

రేవంత్ రెడ్డికి పాలన చేతకావట్లేదన్న హరీశ్ రావు.. రైతుల మీద ప్రేమ లేకపోవడం వల్లే నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. నీళ్లు ఇస్తే పంట కొనాల్సి వస్తుందని.. ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందనే రేవంత్ సర్కార్ ఇలా చేస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటల కరెంట్ నుండి 8 గంటలు అయిందని.. ముందు ముందు 3 గంటలే అవుతుందని మండిపడ్డారు.  కేసీఆర్ ఉన్నప్పుడు ఒక గంటపాటు కరెంట్ పోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎగిరెగిరి పడేవాడని గుర్తు చేశారు. ఇప్పుడు 7 నుంచి 8 గంటలే ఇస్తున్నారని.. కోమటిరెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>