మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ టెన్షన్: అమెరికా హై అలెర్ట్

కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యం (Middle East)లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ కాన్సులర్ వ్యవహారాల విభాగం ఒక సమగ్ర సెక్యూరిటీ అలెర్ట్ విడుదల చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న సంక్లిష్ట భద్రతా పరిస్థితులు, అనుకోని విధంగా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ట్రావెల్ అడ్వైజరీ సమాచారం ప్రకారం, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్లు విమానాల రద్దు, ఎయిర్‌స్పేస్ మూసివేత, ప్రయాణ అంతరాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ అరేబియాతో పాటు పౌర విమానాశ్రయాలపై కూడా దాడులకు పాల్పడ్డారని, ఈ సైనిక వివాదం వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది.

మధ్యప్రాచ్యం బయట ఉన్న అమెరికన్లు కూడా ఈ ప్రాంతానికి లేదా దీని గుండా ప్రయాణించే ప్లాన్‌లను పునఃపరిశీలించాలని కోరింది. ప్రయాణాలు చేసే వారు విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రయోజనాలపై ఇరాన్ లేదా దాని మద్దతుదారుల నుంచి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>