శాంతినగర్‌లో వైభవంగా లక్ష్మీ గణపతి హోమం

కలం, జోగులాంబ గద్వాల: వడ్డేపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్‌ (Shanthinagar)లో శనివారం ఏకదంతాయ యువత ఏర్పాటు చేసిన గణపతి మండపంలో అత్యంత వేడుకగా వైభవంగా లక్ష్మీ గణపతి, సుదర్శన హోమాలు అర్చకులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 13 హోమ గుండాల ముందు 13 జంటలు ఆసీనులై హోమాలు నిర్వహించారు. భార్గవ్ యువసేన బృందం ఏర్పాట్లు చేసింది. ముందుగా అర్చకులు గోమాత పూజ నిర్వహించి కార్యక్రమం ప్రారంభోత్సవం చేశారు. అన్న ప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అన్నదాత ప్రసాద కర్తగా భార్గవ యాదవ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్ రెడ్డి, భరత్, సాయి, చెర్రీ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>