కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) లోని హనుమాన్ నగర్ బజరంగ్ దళ్ యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కుంకుమ పూజలు నిర్వహించారు. శనివారం అర్చకులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో మహిళలచే గౌరీ, లక్ష్మి,పూజలతో పాటు కుంకుమార్చనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీకి చెందిన మహిళలు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని.. అమ్మవారికి కుంకుమభిషేకాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులతోపాటు మహిళా భక్తులు ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ… గత 8 ఏళ్లుగా ఇక్కడ వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు.. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అదేవిధంగా చిన్నపిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు.. వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వహించి.. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ యూత్ సభ్యులు ఇప్పరపల్లి శివ, గరిగే అశోక్, మియాపురం బన్నీ, అంకాల వినయ్, గుర్రం రాహుల్, గౌతమ్, ఆశిష్, కాలనీవాసులు లక్ష్మీ, శ్రావ్య, అనిత, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు.

