న్యూ సాంగ్వి కేజీబీవీలో బాలికలకు న్యాయ అవగాహన

కలం, మామడ: మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలోని (New Sangvi Village) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. రవీందర్‌ మాట్లాడుతూ.. విద్యార్థినులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, న్యాయ సహాయం గురించి వివరించారు. మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు.

అనంతరం అధికారులు కేజీబీవీ హాస్టల్‌ ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థినులకు అందుతున్న వసతులు, పరిసరాల పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సఖి కేంద్రం ప్రతినిధి స్వాతిరాణి, భరోసా కేంద్రం ప్రతినిధి ఎం. జ్యోతి, కేజీబీవీ ప్రత్యేక అధికారి ఆర్. జ్యోతి, సీడీపీఓ మురళి, ఎంపీడీఓ విజయ్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>