పుజారాకు కమిన్స్ ఫిదా.. టఫ్ బ్యాటర్ అతడే!

కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్‌లో పుజారా విలువ ఏంటో మరోసారి తెలిసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన భారత బ్యాటర్‌గా చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ను ఎంపిక చేశారు. ఇటీవల ప్రైమ్ వీడియో స్పోర్ట్‌తో జరిగిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి తాను ఎదుర్కొన్న కఠినమైన ఆటగాళ్లను కమిన్స్ ఎంపిక చేశారు. భారత్ నుంచి పుజారా పేరును చెప్పారు. పుజారాను ఔట్ చేయడం చాలా కష్టమని కమిన్స్ వివరించారు. ఎంతసేపైనా క్రీజులో ఉండేందుకు పుజారా సిద్ధంగా ఉంటారని చెప్పారు.

100 డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చినా ఆయన వెనక్కి తగ్గరని కమిన్స్ పేర్కొన్నారు. పుజారా బౌలర్లకు అవకాశాలు ఇవ్వకుండా చాలా ఓపికగా ఆడేవారని తెలిపారు. పాకిస్థాన్ నుంచి మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను కమిన్స్ ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ నుంచి అలస్టెయిర్ కుక్, దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెకల్లమ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్‌ను ఎంపిక చేశారు. కమిన్స్ చెప్పిన జాబితాలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు ఎవరూ లేరు.

పుజారా గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. భారత్ తరఫున 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఆయన బ్యాటింగ్ సగటు 43.60గా ఉంది. ఐదు వన్డేల్లో 51 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా తదుపరి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్‌లో ఉంది. ఆ తర్వాత కమిన్స్ దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టుతో కలవనున్నారు. టెస్టు సిరీస్ అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>