ఉప ఎన్నికలో పోటీపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : తన అనర్హత వేటుపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో లేనట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ కాపీని పూర్తిస్థాయిలో చదివినట్లు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలా? వద్దా? అనేది తెలంగాణ శాసనసభ స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు పక్కనబెట్టినందున, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటే అది స్పీకర్ పరిధిలోనే ఉండే అంశమని, ఆ నిర్ణయం పూర్తిగా ఆయనదేనన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ

అనర్హత వేటుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు దానం నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం చెబుతూ… “నువ్వు ఫైటర్‌వి, దేనికి భయపడాల్సిన పనిలేదు.. పొలిటికల్‌గా ధైర్యంగా పోరాటం చేయాలి” అని సూచించినట్లు వెల్లడించారు. సీఎం ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత పట్టుదలతో ముందుకెళ్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తనకు ఎన్నికలు కొత్తేమీ కాదని, మళ్లీ ఎన్నికల్లో కొట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తన అనుచరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తేల్చి చెబుతున్నానని, రాబోయే ఉపఎన్నిక ఎదుర్కొనేందుకు సన్నాహకాలు చేసుకోవాలని వారికి పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>