కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ మీడియా సంస్థలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి రాకుండా నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో నిజాయితీతో కూడిన వార్తలు ప్రసారం కావలసిన అవసరం ఉందని, ఈ సంస్థలు ఏకపక్షంగా, అబద్ధాలతో కూడిన వార్తలను ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ విమర్శించారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతా వేదికగా అధికారికంగా వెల్లడించారు. వార్తా సంస్థలు అబద్ధాలు, కల్పిత కథనాలు ప్రసారం చేయడాన్ని ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో మరికొన్ని ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సంస్థలపై కూడా నిషేధం విధిస్తామని ఆయన హెచ్చరించారు.

