వైట్‌హౌస్ నుండి ప్రముఖ మీడియా సంస్థలపై వేటు!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ మీడియా సంస్థలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి రాకుండా నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో నిజాయితీతో కూడిన వార్తలు ప్రసారం కావలసిన అవసరం ఉందని, ఈ సంస్థలు ఏకపక్షంగా, అబద్ధాలతో కూడిన వార్తలను ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ విమర్శించారు.

ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతా వేదికగా అధికారికంగా వెల్లడించారు. వార్తా సంస్థలు అబద్ధాలు, కల్పిత కథనాలు ప్రసారం చేయడాన్ని ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో మరికొన్ని ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సంస్థలపై కూడా నిషేధం విధిస్తామని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>