ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడి ఫోన్.. కీలక చర్చలు!

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi)కి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫోన్ చేశారు. ఇటీవల బ్రిక్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించడంతో పాటు పుట్టిన రోజు జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్–యూఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కీలకంగా చర్చించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం, శక్తి వంటి రంగాలపై కూలంకషంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చినందుకు యువ రాజు షేక్ ఖలీద్‌కు ధన్యవాదాలు చెప్పారు. బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంలో యూఏఈ చేసిన కృషి, అందించిన మద్దతుపై మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

పశ్చిమాసియా పరిస్థితులపై..

పశ్చిమాసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. శాంతి నెలకొనడంతో పాటు ప్రాంతీయంగా సెక్యూరిటీ, స్థిరత్వం నెలకొనేందుకు అవసరమైన ప్రయత్నాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. అలాగే, రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా నిరంతరం చర్చలు జరుపుతూనే ఉండాలని కూడా భావించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>