అనుచరులతో మంతనాలు.. దానం నెక్స్ట్ స్టెప్ ఇదేనా!

కలం, వెబ్ డెస్క్: కాసేపటిక్రితమే తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)పై రాష్ట్ర హైకోర్టు వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై దానం సమావేశమయ్యారు. హైకోర్టు వేటు వేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించే  యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అటు న్యాయనిపుణులతోనూ దానం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, దానం తదుపరి నిర్ణయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>