చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇది: ఎమ్మెల్యే ఏలేటి

కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. పిటిషన్‌దారుల్లో ఒకరైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీర్పుపై హర్హం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ ఎన్నో రోజులుగా దీనిపై పోరాటం చేస్తోందన్నారు. స్పీకర్ ఎంత కాపాడే ప్రయత్నం చేసినా.. హై కోర్టు తీర్పు ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించిందన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా.. వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలన్నారు.

రేపు కేవియట్ పిటిషన్ దాఖలు..

దానం నాగేందర్ సుప్రీం కోర్టుని ఆశ్రయించే నేపథ్యంలో రేపే తాము కేవియట్ పిటిషన్ కూడా వేయబోతున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకుని, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకుంటోందన్నారు. న్యాయం వైపు నిలబడి బీజేపీ పోరాటం చేసిందని ఎమ్మెల్యే ఏలేటి గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>