కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం మద్దిమడుగు (Maddimadugu Temple) లో తలనీలాలు, కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలకు గురువారం నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలికింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ మహబూబ్ నగర్‌లో వేలం నిర్వహించారు.
ఈ వేలంలో తలనీలాలు రూ. 1, 30,05,000 (అక్షరాల ఒక కోటి ముపై లక్షల ఐదు వేల రూపాయలకు) ఇండియన్ హేర్ ఎంటర్ ప్రైజెస్, ప్రకాశం జిల్లాకు చెందినవారు దక్కించుకున్నారు. కొబ్బరి కాయల టెండర్‌ను రూ.55,01,116 (యాభై ఐదు లక్షల ఒక వేయి ఒకవంద పదహారు) కు మహబూబ్ నగర్‌కు చెందిన అరుణ్ కుమార్ దక్కించుకున్నారు . కొబ్బరి చిప్పలు. రూ.13,55,555 (పదమూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల)కు ఎస్ సిదార్త్ వేములవాడకు చెందినవారు దక్కించు కున్నారు.
ఈ వేలం పాట కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ టి. మదన్ కుమార్, మద్దిమడుగు దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. రంగా చారి, దేవాలయ చైర్మన్ డి. రాములు నాయక్, దేవాలయ కమిటీ మెంబర్ కొయ్యల వెంకటయ్య, దేవాలయ సిబ్బంది పి. పరంధామ్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ వి. విశ్వేశ్వర్ రెడ్డి, పి. అజయ్, కోటయ్య, నందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

