నిర్మల్‌ యువతకు ఉచిత మెగా ఇంపాక్ట్ శిక్షణ

కలం, నిర్మల్ : నిర్మల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఉచిత మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ (Mega Impact Program) నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి, ప్రోగ్రామ్ చైర్మన్ ఇప్ప ముత్యం రెడ్డి, ఇంపాక్ట్ రీజియన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తెలిపారు. కడ్తాల్ గ్రామ శివారులోని సాగర్ కన్వెన్షన్ హాల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, గృహిణులకు ఉపయోగపడేలా మెగా ఇంపాక్ట్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు నేతృత్వంలో కార్యక్రమం కొనసాగతుందని పేర్కొన్నారు. ప్రముఖ స్పీకర్లు కె.వి. ప్రదీప్, ఎం.బాలా లత, ఏఐ నిపుణులు నిఖిల్ గుండా, అప్పాల ప్రసాద్, అమోఘ్ దేశపాతిల్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మందికి పైగా మోటివేషనల్ స్పీకర్లు పాల్గొంటారని చెప్పారు. కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, లైఫ్ స్కిల్స్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించనున్నారని, ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>