కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మధ్య ఐక్యత, సామరస్యం, సోదరభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ కోసం వివిధ దశల్లో పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్లను పది శాతానికి పెంచి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, నాయకులు గండ్రత్ రమేష్, సాయి రెడ్డి, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములు.. నోటీసులకు రెవెన్యూ శాఖ కసరత్తు
Follow Us On : WhatsApp

