నిర్మల్‌లో ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

కలం, నిర్మల్ : సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినోత్సవ (Praja Palana Day) వేడుకలకు నిర్మల్‌ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గురువారం జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించనున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాతో పాటు వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>