మోదీ సర్కార్ అమెరికా ఒత్తిడికి తలొగ్గింది: కాంగ్రెస్ నేతల ఫైర్

కలం, వెబ్ డెస్క్ : యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (UPI MDR Charges) విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధించడాన్ని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమని మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ లాబీల ఒత్తిడికి లోనయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. విదేశీ, ముఖ్యంగా అమెరికా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల అంతిమంగా పేద, మధ్యతరగతి ప్రజలపైనే తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ స్పందిస్తూ, వ్యాపారులపై వేసే ఎండీఆర్ భారాన్ని వారు పరోక్షంగా వినియోగదారుల పైనే నెట్టివేస్తారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యుడి జేబుకు ఈ కొత్త ఛార్జీలు మరింత చిల్లు పెడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా పేరు చెప్పి సామాన్య ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>