కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ ఫస్ట్ (Mahabubnagar First ) శిక్షణ కేంద్రంలో ప్రతిష్టించిన శ్రీ మహాగణపతికి రెండవ రోజు మంగళవారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ ఆధ్వర్యంలో, సంతోష్ ఆచార్య మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, నాయకులు, శిక్షణ కేంద్రం ఉద్యోగులు, విద్యార్థులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గుండా మనోహర్ ఆకాంక్షించారు. గణపతి మండపం ప్రాంగణంలో గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మహబూబ్‌నగర్ ఫస్ట్‌లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ప్రత్యేక కళారూపాల్లో రూపొందించారు. ఈ కార్యక్రమంలో అనిల్, వందేమాతరం ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, నిజలింగప్పతో పాటు మహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రం ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

