మహబూబాబాద్‌లో కలకలం.. వైన్స్‌ ఎదుట భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా పేట మండల కేంద్రంలోని మధుర వైన్స్ ఎదుట యాకయ్య–స్వాతి అనే దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అధికారులు తమపై దాడి చేసి రూ.40 వేల విలువైన మద్యం సీజ్‌ చేశారని ఆరోపిస్తూ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. బెల్ట్‌ షాప్‌ నిర్వహణకు సంబంధించి అధికారులు తమపై చర్యలు తీసుకున్నారని దంపతులు ఆరోపించారు. వైన్‌ షాప్‌లోనే మద్యం కొనుగోలు చేసి వారి అనుమతితోనే విక్రయిస్తున్నామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>