ప్రయాణికులకు గుడ్ న్యూస్: వరంగల్ – కాజీపేట మధ్య ‘1B’ లోకల్ బస్సులు!

కలం, హనుమకొండ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వరంగల్ – కాజీపేట (Warangal – Kazipet) మధ్య అదనంగా లోకల్ బస్సులు హనుమకొండ బస్టాండ్ మీదుగా నడపనున్నట్లు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోమరాజు భవాని ప్రసాద్ తెలిపారు.1B పేరుతో ప్రతిరోజు 46 ట్రిప్పులను తిప్పడం జరుగుతుందని ఆయన వివరించారు. వరంగల్ నుండి హనుమకొండ చౌరస్తా, హనుమకొండ బస్టాండ్, కాళోజీ కళాక్షేత్రం, బాలసముద్రం, అదాలత్ మీదుగా కాజీపేటకు పోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాజీపేట నుండి అదాలత్, బాలసముద్రం, కాళోజీ కళాక్షేత్రం, అశోక జంక్షన్ ,హనుమకొండ చౌరస్తా మీదుగా వరంగల్ కు ఈ బస్సులు నడపడం జరుగుతుందని తెలిపారు.

నగర ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని హనుమకొండ సెంట్రల్ బస్టాండ్ నుంచి దూర ప్రాంతాలకు బస్సులు ఉండడం వలన వాటిని అనుసంధాన పరిచే క్రమంలో 1B బస్సులను నడపడం జరుగుతుందని వివరించారు. వరంగల్-కాజీపేట (Warangal – Kazipet) రైల్వే ప్రయాణికులు కూడా హనుమకొండ బస్టాండ్ కు రావడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తాము గ్రహించామని, దీనికి అనుగుణంగా 1B బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ట్రిప్పులు పెంచడానికి కూడా ప్రయత్నిస్తామన్నారు. గతంలో తిరుగుతున్నట్లుగానే మరికొన్ని లోకల్ బస్సులు పెట్రోల్ పంపు, పబ్లిక్ గార్డెన్ ద్వారా కూడా నడుస్తాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకొని ఆర్టీసీని మరింతగా ఆదరించాలని ఆర్ఎం కోరారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు : రాంచందర్ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>