డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలి : ఆప్

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ – కౌట్ల (కె) గ్రామాల మధ్య నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను (Double Bedroom Houses) అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ (Syed Haider) డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ జిల్లా నాయకులతో కలిసి గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. సుమారు రూ. 31.80 కోట్ల అంచనా వ్యయంతో 25 బ్లాకుల్లో 600 కుటుంబాల కోసం నిర్మించిన ఇళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మౌలిక వసతులు కల్పించి కేటాయింపులు చేపట్టాలి

కాలనీలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని, లేనట్లయితే బాధితులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సయ్యద్ హైదర్ హెచ్చరించారు.

Also Read : మహిళ కొంపముంచిన 80s ట్రెండ్.. 45 ఏళ్ల నాటి చోరీ గుట్టురట్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>