బోసి వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో ముధోల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

కలం, తానూర్: తానూర్ మండలం బోసి గ్రామంలోని ప్రసిద్ధ వరసిద్ధి కర్ర విఘ్నేశ్వరుడిని ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి, వరసిద్ధి వినాయకుడి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ.. వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, తానూర్, ముధోల్ మండలాల బీజేపీ నాయకులు, సర్పంచ్‌లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>