పులివెందులలో ఘర్షణ.. కాల్పుల కలకలం!

కలం, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల (Pulivendula)లో అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. స్థానిక టీడీపీ నేతలు పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వినాయక మండపం వద్ద అర్ధరాత్రి జరిగిన వాగ్వాదంలో విజయ్ రెడ్డి, పుష్పనాథ్ రెడ్డిపై దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు.

దీంతో పుష్పనాథ్ రెడ్డి వర్గీయులు విజయ్ రెడ్డి ఇంటి వద్ద కార్లను ధ్వంసం చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ భాషా గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>