మేఘారెడ్డి కృషికి ఫలితం.. వెల్టూరులో టీజీపీఎస్‌కు గ్రీన్‌సిగ్నల్

కలం, వనపర్తి: పెద్దమందడి మండలం వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS Veltoor) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో నెం.164 ద్వారా రూ.11.75 కోట్ల నిధులను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో టీజీపీఎస్ ఏర్పాటు కీలక ముందడుగుగా నిలవనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

టీజీపీఎస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవతో కృషి చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డా. మల్లు రవికి కృతజ్ఞతలు తెలిపారు. వెల్టూరులో పాఠశాల ఏర్పాటు ద్వారా పరిసర గ్రామాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>