కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కమ్యూనిస్టు పార్టీ ప్రజా ఉద్యమాలకి ఉతంగా నిలిచిన కామ్రేడ్ జ్యోతి ఆకస్మిక మరణం పెను విషాదకరమని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. శనివారం అమరచింత మండల కేంద్రంలోని శ్రీకృష్ణ నగర్ గొల్లవీధిలో(Golla Veedhi) ఈనెల 6న తీవ్రమైన అనారోగ్యంతో మృతి చెందిన సీపీఐ జిల్లా కార్యదర్శి కే.విజయరాములు సతీమణి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి విజయ రాములు కుటుంబాన్ని ఓదార్చారు.
ప్రజా ఉద్యమాల పట్ల జ్యోతి అంకితభావం
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విజయ రాములు చిన్నతనము నుండి విప్లవ భావజాలంతో పెరిగారని ప్రజా సమస్య పరిష్కారం సమసమాజ స్థాపనే లక్ష్యంగా సాగిన పోరాటాల్లో పాలకుల అనేక నిర్బంధాలను జైలు జీవితాలు సైతం అనుభవిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జ్యోతి ఏనాడు బూర్జవ ఆలోచనల వైపు నడవలేదని అన్నారు. కుటుంబ పోషణ, బాధ్యత కోసం జ్యోతి అనేక ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నారని ఉన్నత చదువులు చదువుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం పొందిందని అన్నారు. జ్యోతిని క్యాన్సర్ మహమ్మారి కభలించడం బాధాకరమని శాస్త్ర సాంకేతిక రంగాల అత్యాధునిక వైద్య సేవల అందుబాటులో ఉన్నాయని ప్రగల్బాలు పలుకుతున్న క్యాన్సర్ లాంటి రోగాలకు నేటికీ పూర్తిస్థాయి వైద్యం లేదని అన్నారు.
జ్యోతి ఆశయాలను కొనసాగించాలి
జ్యోతి కమ్యూనిస్టు కార్యకర్తల (Communist activists) పట్ల నాయకుల పట్ల ఎంతో అభిమానం చూసేవారని అన్నారు. జ్యోతి మరణం కమ్యూనిస్టు పార్టీకి విజయ రాములు కుటుంబానికి ఎంతో తీరనిలోటని జ్యోతి ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, సీపీఐ నేత పరమేశ్ గౌడ్,సీపీఐ నేతలు అబ్రహం శ్రీహరి నరసింహ శెట్టి రాబర్ట్ అబ్రహం, మోష, భరత్, లక్ష్మీనారాయణ శెట్టి సురేష్, రాంపూర్ సర్పంచ్ నాగరాజ్, శ్యాంసుందర్,రవీందర్, కథలప్ప, లక్ష్మీనారాయణ, కుమార్,బాలరాజ్, రవీందర్, బాలకృష్ణ, బాలస్వామి, నాగేంద్రం కురుమూర్తి, గీత, పద్మావతి, శ్యామల, శారద, భారతి, లయ తదితరులు పాల్గొన్నారు.

