ఆవు పేడతో గణపయ్య.. నిమజ్జనం చేస్తే ఎరువుగా మారే వినాయకుడు!

కలం, ఖమ్మం బ్యూరో : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, రసాయన రంగుల వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించేందుకు ఖమ్మం నగరంలోని టేకులపల్లి గోశాల నిర్వాహకులు శ్రీనివాస చార్యులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆవు పేడతో వినాయక విగ్రహాలను (Eco-Friendly Ganesh Idols) తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు బాధ్యతను చాటుకుంటున్నారు. నీటిలో నిమజ్జనం చేసిన 25 రోజుల్లో ఇవి పూర్తిగా కరిగిపోయి, ఆ తర్వాత మొక్కలకు ఎంతో బలమైన ఎరువుగా ఉపయోగపడటం ఈ విగ్రహాల ప్రత్యేకత.

​ఆవు పేడతో పాటు చెక్క పొట్టు, ముల్తానీ మట్టిని తగిన పరిమాణంలో కలిపి 10 అంగుళాల నుంచి 2 అడుగుల ఎత్తు వరకు ఎంతో ఆకర్షణీయమైన విగ్రహాలను రూపొందిస్తున్నారు. విగ్రహాలకు వేసే రంగుల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన నేచురల్ కలర్స్ మాత్రమే వినియోగిస్తున్నారు.

​గత ఏడాది ప్రయోగాత్మకంగా 150 ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను తయారు చేసి విక్రయించగా భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో, ఈ ఏడాది ఏకంగా 500 ప్రతిమలను విక్రయానికి సిద్ధం చేశారు. భక్తులకు అందుబాటులో ఉండేలా 10 అంగుళాల విగ్రహాన్ని 150 రూపాయలకు, 2 అడుగుల విగ్రహాన్ని 800 రూపాయలకు అందిస్తున్నారు. ​ప్రకృతిని కాపాడుతూ, భక్తిని చాటుకునేలా గోమయ విగ్రహాలనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>