కోర్టు ఉత్తర్వులు బేఖాతరు: పంచాయతీ కార్యదర్శి ప్రియాంక సస్పెన్షన్

కలం, మెదక్ బ్యూరో: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి (Muppireddipally) గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను సస్పెండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియాంక గతంలో కళ్ళకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఓ గృహ నిర్మాణానికి సంబంధించి వివాదం నెలకొంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆమె వాటిని లెక్కచేయకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, శాఖాపరమైన విచారణ అనంతరం ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా కోర్టు ఉత్తర్వులను విధిగా పాటించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>