కలం, నిర్మల్ : వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్మల్ (Nirma) ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను (Eco-Friendly Ganesh Idols) స్వయంగా తయారు చేసి తమ సృజనాత్మకతను చాటుకున్నారు.
పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటుతూ విద్యార్థులు ఆసక్తిగా విగ్రహాలను రూపొందించారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ కే.సూర్యసాగర్, డాక్టర్ ఎం.రజిత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సుధాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ యు. గంగాధర్, రమేశ్ రెడ్డి, హేమలత, శ్రీహరి, సుభాష్, అర్చన, త్రిపాఠి, నరేంద్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.

