విషాదం.. తల్లి మరణం.. కొద్దిగంటల్లోనే కుమారుడి మృతి!

కలం, మెదక్ బ్యూరో: తల్లి మరణవార్తను తట్టుకోలేక కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాద సంఘటన మెదక్ (Medak) జిల్లా పెద్దశంకరంపేట మండలం మక్తా లక్ష్మాపూర్ (Maktha Lakshmapur) పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తా లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బేతమ్మ (45) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లింది. కాగా, నిన్న భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్థలు, గొడవలు జరిగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బేతమ్మ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లి మృతితో కుమారుడికి తీవ్ర మనోవేదన

ఈ విషయం తెలిసిన ఆమె కుమారుడు ప్రవీణ్ (19) తల్లి మరణవార్తను తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురైన అతడు, కొలపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు వరుసగా ఆత్మహత్యకు పాల్పడటంతో మక్తా లక్ష్మాపూర్ (Maktha Lakshmapur) గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బీఆర్ఎస్ వాళ్ళ కోసం ధరణిలో సీక్రెట్ లాక్.. పొంగులేటి ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>