బీఆర్ఎస్ వాళ్ళ కోసం ధరణిలో సీక్రెట్ లాక్.. పొంగులేటి ఫైర్

కలం, వెబ్ డెస్క్: తాము చెప్పినట్లుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కు ఎండ్ కార్డు వేసి భూ భారతి పోర్టల్ తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22A భూ రిజిస్టేషన్ల విషయంపై శనివారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. బీఆర్ఎస్ వాళ్లు తమ అక్రమ ఆస్తులు కనబడకుండా ఉండేదుకే ధరణిలో లాక్ సిస్టమ్ తీసుకొచ్చారని ఆరోపించారు. ధరణిలో సీక్రెట్ లాక్ సిస్టమ్ ఉండేదని.. దీంతో వాళ్ళ సమస్యలు వస్తే మాత్రం క్షణాల్లో పరిష్కరించుకునేవారని ఆరోపించారు.

అందుకే  వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థ రద్దు..

ధరణి (Dharani) చట్టాన్ని తెచ్చినప్పుడు 3 నెలలు రిజిస్టేషన్లు ఆపేశారని పొంగులేటి మండిపడ్డారు. కనీసం ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తాము చెప్పింది వినలేదనే వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేశారని ఆరోపించారు. దీంతో భూములు ఉన్న యజమానులు రోడ్డున పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను రిజెక్ట్ చేయడమే తప్పితే సమాధానం ఇవ్వలేదన్నారు. ధరణితో ఇబ్బంది పడుతున్నామని 2.46 లక్షల అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. భూ భారతి (Bhu Bharati) వచ్చిన తర్వాత అన్నీ కలిపి 5.46 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

రైతులు ఆత్మహత్య చేసుకున్నారు..

గతంలో ధరణిలో సమస్య వస్తే పరిష్కరించే వారే లేరని.. భూ సమస్యలతో వందల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పొంగులేటి ఆరోపించారు.  సిద్ధిపేట జిల్లా మిరుదొడ్దిలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ధరణిని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. విదేశీ సంస్థకు ధరణి కాంట్రాక్టు ఇచ్చారని.. ఈ కాంట్రాక్టు కూడా వారి తొత్తులకే ఇచ్చారని ఆరోపించారు. మొదటి ఐదేళ్లతో పాటు రెండవ సారి కూడా రెవెన్యు శాఖను అప్పటి సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు. గతంలో రెవెన్యూ మంత్రి ఉన్నా అంతా ముఖ్యమంత్రే చూసుకునేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లు దోచుకున్నారు..

ధరణి పోర్టల్ తో పింక్ కలర్ షర్ట్ వేసుకున్నవాళ్లకే బెనిఫిట్ అయ్యిందని పొంగులేటి దుయ్యబట్టారు. పదేళ్లు ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఆరోపించారు. దీనిపై తాము సభలో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సి వస్తుందనే సభ నుంచి పారిపోయారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి 22A భూముల పేరుతో పేదల కడుపుకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టాం..

తాము అసెంబ్లీ సాక్షిగా భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టామని  పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల సూచనలు సైతం పరిగణలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూ భారతిని తీసుకొచ్చామని తెలిపారు. గత పాలకుల్లా ప్రైవేట్ కంపెనీలకు భూ భారతిని అప్పగించలేదని.. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ NICకి భూ భారతిని అప్పగించామని చెప్పారు. రైతుల భూ సమస్యలపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. రైతుల భూ సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) చెప్పుకొచ్చారు.

Also Read : అధికారం కాదు… భాగస్వామ్యం ముఖ్యం: ప్రధాని మోదీ పిలుపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>