ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు తగ్గించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారి వేతనాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో దుర్మార్గమన్నారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న వారి అనుభవాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా.. కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టడమేంటన్నారు. 31 వేల మంది ఉద్యోగుల పాలిట కొత్త జీవో శాపంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేతనాలు పెంచుతూ వెళ్లామని.. కాంగ్రెస్ హయాంలో కోతపెడుతున్నారని ఆరోపించారు.

జీవో రద్దు చేయాల్సిందే..

మున్సిపాలిటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన జీవో నెం.1181ను వెంటనే రద్దు చేయాల్సిందేనని హరీశ్ రావు హెచ్చరించారు. అంతేగాకుండా వారికి వేతన రక్షణతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవం ఆధారంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకనైనా.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోస్టులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>