కలం, వెబ్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ఢిల్లీకి చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన ఆయనకు పాలెం ఎయిర్పోర్టులో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. గల్వాన్ ఘర్షణలు జరిగిన ఏడు సంవత్సరాల తరువాత జిన్ పింగ్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి. సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపబోతున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే.
Also Read : తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ
Follow Us On : WhatsApp

