బ్రిక్స్ సదస్సు.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ విమానాలు, కారు

కలం, నేషనల్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత భద్రత ఉండే దేశాధినేతల్లో ఒకరైన రష్యా ప్రెసిడెంంట్ వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు సొంత విమానంతో పాటు ప్రత్యేక కార్లను వెంట తీసుకొస్తారు. ఈసారి ఆయన భద్రత కోసం ఒకేలా ఉండే రెండు అత్యాధునిక ఇల్యూషిన్ ఐఎల్-96-300పీయూ విమానాలను ఢిల్లీకి రప్పించారు. అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో శత్రువులకు తెలియకుండా ఉండేందుకు ఈ రెండు విమానాలూ ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి.

అత్యాధునిక రక్షణ..

శత్రు రాడార్లను జామ్ చేయడంతో పాటు క్షిపణుల నుంచి రక్షణ కల్పించే అత్యాధునిక వ్యవస్థలున్న మొబైల్ కమాండ్ సెంటర్ విమానాన్ని.. రక్షణ వర్గాలు ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ లేదా ‘డూమ్స్డే ప్లేన్’ (ప్రళయాన్ని తట్టుకునే విమానం)గా పిలుస్తాయి. మరోవైపు, ఢిల్లీ వీధుల్లో ఆయన (Vladimir Putin) ప్రయాణిస్తున్న అత్యంత విలాసవంతమైన, బాంబు దాడులను సైతం తట్టుకునే బుల్లెట్‌ ప్రూఫ్ కారు ‘ఔరస్ సెనాట్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని అత్యున్నత రక్షణ సామర్థ్యం కారణంగా నిపుణులు దీనిని ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’ (చక్రాలపై నడిచే కోట) అని పిలుస్తుంటారు.

Also Read : బ్రిక్స్ సదస్సులో డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>