మల్దకల్‌లో విద్యుత్ కోతలపై రైతుల నిరసన

కలం, జోగులాంబ గద్వాల: వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటికి అవసరమైన సమయంలో విద్యుత్ అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ శుక్రవారం మల్దకల్ సబ్‌స్టేషన్ (Maldakal Substation) ఎదుట గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>