తెలంగాణ వ్యాప్తంగా బ్యాన్.. తక్షణమే అమల్లోకి..

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనలాగ్ పనీర్ (Analog Paneer)పై నిషేధం విధించింది. నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్ ను బ్యాన్ చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. పనీర్ పేరుతో తయారీ, ప్రోసెసింగ్ తో పాటు ప్యాకింగ్, నిల్వ చేయడం, విక్రయించడం పైన నిషేధం విధించింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) కింద టీజీ సేఫ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>