హనుమకొండలో సాయుధ పోరాట వారోత్సవాల ర్యాలీ

కలం, హనుమకొండ : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను దొంగిలించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని సిపిఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. రజాకార్లు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని శుక్రవారం హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలో బాలసముద్రం నుండి ఏకశిలా పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.

బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, ఏకశిలా పార్కు వద్ద గల, తెలంగాణ సాయుధ పోరాట అమరుడు థానునాయక్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఐ శ్రేణులు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని, సాయుధ పోరాట వీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన అసలైన చారిత్రాత్మక పోరాటమని కొనియాడారు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రజలు సాహసోపేతమైన పోరాటం చేశారని, ఆనాటి పోరాట స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాటి సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగున్నర వేల కమ్యూనిస్టు అమరుల త్యాగాలతో ఎర్ర బారిన నేల తెలంగాణ అని అన్నారు. నిజాం నిరంకుశ పాలనను కూలదోసింది కమ్యునిస్టులేనని, పటేల్ సైన్యం కాదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన రద్దయిందని, పటేల్ సైనిక చర్య వల్ల కాదని అన్నారు.

ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి, 3 వేయి గ్రామాలను విముక్తి చేసింది కమ్యూనిస్టులేనని చెప్పారు. ఆనాడు పటేల్ చీకటి ఒప్పంద ఫలితమే నిజాం రాజుకు గవర్నర్ పదవి దక్కిందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులను స్మరించుకుందామని, వారి ఆశయ సాధనకు ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, అమరుల జీవిత చరిత్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్,సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, ఏదునూరి వెంకట్రాజం, నేదునూరి రాజమౌళి, ఎన్. అశోక్ స్టాలిన్, యేషబోయిన శ్రీనివాస్, కండె నర్సయ్య, నిమ్మల మనోహర్, గుంటి రాజేందర్, అల్వాల రాజు, నోముల కిషోర్, రాంగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>