కస్బా హైస్కూల్‌లో DLSA ఆకస్మిక తనీఖీ.. విద్యార్థులకు కీలక సూచనలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Kasba Govt High School) ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి పి. రవీందర్ (Ravinder) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, విద్యాబోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటగదిని పరిశీలించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యతపై ఆరా తీశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని, ప్రతిరోజూ చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, భూమన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>