కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందడి నెలకొంది. 11 మంది దేశాధినేతలు దీనికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వారితో ప్రధాని మోదీ (PM Modi) వరుస భేటీలు జరపబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.30 గంటలకు భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇండియా–రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ భేటీ జరగబోతుంది.
సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడితో..
ప్రధాని మోదీ సాయంత్రం 6.15 గంటలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ కాబోతున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి తరువాత ఆ దేశ అధ్యక్షుడు భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఇంకా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అర గంట పాటు చర్చలు జరగబోతున్నాయి. సాయంత్రం 6.45 గంటలకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో ప్రధాని సమావేశం కాబోతున్నారు. రేపు సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ కానున్నారు.

