స్టార్ హీరోలకు నోటీసులు.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలకు సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మహేశ్ బాబు (Mahesh Babu), విజయ్ దేవరకొండ, వెంకటేశ్, ఆనంద్ దేవరకొండతో పాటు రాజమౌళి, సమంత, ఉపాసన కొణిదెలకు కూడా నోటీసులు వెళ్లాయి. వారు సమర్పించిన ఓటర్ దరఖాస్తు ఫారాల్లో తప్పులు ఉండటంతోనే నోటీసులు పంపించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సినీ ప్రముఖులే కాకుండా మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, ప్రముఖ వ్యాపారవేత్త దివి మురళీకృష్ణ ప్రసాద్‌కు సైతం తప్పులు సరిదిద్దుకోవాలని నోటీసులు ఇచ్చారు.

వెబ్‌సైట్‌లో పూర్తి జాబితా..

ఎన్నికల సంఘం ఎవరికీ నోటీసులు జారీ చేసిందో వెబ్‌సైట్‌లో పూర్తి జాబితా అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా, నియోజకవర్గాల వారీగా పేర్లను ఎంటర్ చేస్తే.. నోటీస్ వచ్చిందో, లేదో తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి, నోటీసులు రాకపోతే వారి వివరాలు సరిగ్గానే ఉన్నట్లు అర్థం చేసుకోవాలని సూచించారు. నోటీసులు జారీ అయిన వారు.. సంబంధిత ధ్రువపత్రాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>