కలం, కరీంనగర్: ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల నిర్విరామ సేవా ప్రయాణాన్ని, దేశాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని, వికసిత్ భారత్ 2047 సంకల్పాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ఈనెల 17 నుండి అక్టోబర్ 17 వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’ ప్రోగ్రాం ను సక్సెస్ చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చెపూరీ సత్యం (Chepuri Satyam) పిలుపునిచ్చారు. గురువారం రోజున తిమ్మాపూర్ బీజేపీ ‘సేవా సంకల్ప అభియాన్’ సన్నాహక సమావేశం అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యం సేవా సంకల్పయాన్ ప్రోగ్రాంకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని, ఆయన అంకితభావాన్ని కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని సత్యం సూచించారు. దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం సేవా సంకల్పంతో నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ సూచించిన, నిర్దేశించిన ప్రతీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
రాష్ట్రంలో వేలాది మంది రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులను కాలరాస్తున్న 22ఏ భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరీ సత్యం, మండల అధ్యక్షులు చింతం డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకొని, ఈ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రోజున ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కార్యదర్శి సత్యం, చింతం శ్రీనివాస్ లు మండల బీజేపీశ్రేణులతో కలిసి ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి చేపూరి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్, మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్, కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు బోనాల మోహన్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఓబీసీ మోర్చ జిల్లా నాయకులు కొయ్యడ శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు గడ్డం అరుణ్, దుర్శేటి రమేష్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, గాండ్ల రాము, బుర్ర శ్రీనివాస్ గౌడ్, జాడి రాజు, బండి స్వామి, బూరుగు శ్రీనివాస్ రెడ్డి, దళిత మోర్చ మండల అధ్యక్షుడు ఎల్కపల్లి స్వామి, కుమార్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

