పాక్ ప్లేయర్లను మైగ్రెంట్లు అనుకున్నారా?

కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ అండర్-19 (Pakistan Under-19) క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్‌లో ఊహించని పరిస్థితి ఎదురైంది. మైగ్రెంట్లు ఉన్నారని భావించిన ఆందోళనకారులు.. ఆ జట్టు ఉంటున్న హోటల్‌ ముందు నిరసనకు దిగారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పోర్ట్స్‌మౌత్‌లో (Portsmouth) జరిగింది. పాకిస్థాన్ యువ జట్టు అక్కడి మారియట్ హోటల్‌లో బస చేస్తోంది. హోటల్‌ వద్ద ఆసియా యువకులతో కూడిన ఓ బస్సు కనిపించిందన్న సమాచారం ఆన్‌లైన్‌లో ప్రచారం కావడంతో ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 30 మంది గుమిగూడారు. అయితే హోటల్‌లో ఉన్నది మైగ్రెంట్లు కాదని తర్వాత తేలింది. వారు పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టు సభ్యులని అధికారులు గుర్తించారు.

రీఫార్మ్ యూకే కౌన్సిలర్ జార్జ్ మ్యాడ్‌విక్ కూడా అక్కడికి వెళ్లారు. హోటల్ సిబ్బందితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆందోళనకారులకు అసలు విషయం వివరించారు. విషయం తెలుసుకున్న తర్వాత ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు కూడా ఘటనపై స్పందించారు. సుమారు 30 మంది గుమిగూడారని, కొద్దిసేపటికే వారు చెదరిపోయారని తెలిపారు. ఎలాంటి నేరం నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై జాత్యహంకార వ్యతిరేక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. మైగ్రెంట్లు, శరణార్థులపై ఉన్న ఉద్రిక్తతలు ఇలాంటి తప్పుదోవ పట్టించే పరిస్థితులకు దారితీస్తున్నాయని పేర్కొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>