కలం, నారాయణపేట: ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు అయ్యేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) ఆదేశించారు. గురువారం నారాయణపేట ప్రభుత్వ వైద్యశాలలో ఎస్పీ వినీత్ తో కలిసి సేవ భారతి పాలమూర్ ఈఎన్టీ (ENT) ఉచిత వినికిడి పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఓపీ ఎక్కువగా ఉందని తెలిపారు. నార్మల్ డెలివరీ లు బాగా జరుగుతున్నాయని 100% బెస్ట్ మెడికల్ కాలేజీ గా నిలబెట్ట వచ్చని తెలిపారు.
పేషేంట్లను బాగా చూసుకోవాలి..
ఆసుపత్రిలో పేషేంట్లను బాగా చూసు కోవాలని.. డాక్టర్లకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మంగళవారం ఆరోగ్యం మహిళ కార్యక్రమం డీఆర్డిఏ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ ,మలేరియాపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ శాఖ వారి సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్పీ తెలిపారు.
సేవా భారతీయ అధ్యక్షులు రాందేవ్ మాట్లాడుతూ.. 1981లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్జీవోగా 3,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. 1990 నుండి ఉమ్మడి ఏపీ తెలంగాణలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 300 మంది అనాధ పిల్లలకు ప్రత్యేకంగా కేంద్రాలలో నడుపుతున్నట్టు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఏడు మంది అర్హులైన అభ్యర్థులకు వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.
10 రోజుల్లో పూర్తి చేయాలి..
నర్సింగ్ కళాశాల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. గురువారం నారాయణపేట నర్సింగ్ కళాశాల, హాస్టల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి కళాశాల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పది రోజులలో పనులు పూర్తిచేసి భవనాలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

