కలం, జనగామ: జనగామ మున్సిపాలిటీ (Jangaon Municipality) చైర్‌పర్సన్ కడమంచి బాలమణి తమ పట్ల అనుచితంగా, అవమానకరంగా వ్యవహరించారని దళిత, మైనార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లిన తమను గౌరవించకుండా అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కౌన్సిలర్లు పానుగంటి సువార్త, మంజుల, సాజిత్, ఫాతిమా సమద్ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి చైర్‌పర్సన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సీడీఎంఏ, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

