కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ ఆత్మగౌరం కోసం పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మని (Chakali Ilamma) డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) కొనియాడారు. గురువారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యం, తెగువ, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయురాలు అని కొనియాడారు.
ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి
భూస్వామ్య, నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సంజీవ్ ముదిరాజ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎంపీ డీకే అరుణ, తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదులా కొత్వాల్, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్ర కుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి, కార్పొరేటర్ ఎంపీ ప్రవీణ్ కుమార్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే రజక సంఘం నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

