కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్జైల్ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) గురువారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జైలు ప్రాంగణం, భద్రతా విధానాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు, ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె పరిశీలించారు. జైలు భద్రతా నిబంధనల అమలు, సిబ్బంది విధుల నిర్వహణ, జైలు పరిసరాల పర్యవేక్షణపై ఆరా తీశారు.
ఖైదీల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ
అనంతరం ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. జైలు భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఏఆర్ ఆర్ఐ రామ్నిరంజన్, జైలర్ సూర్యప్రకాశ్ రెడ్డి, హెడ్ వార్డెన్, జైలు గార్డింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

