కలం, నిర్మల్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single-Use Plastic) వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని పలు ప్లాస్టిక్ దుకాణాలు, స్వీట్ హోంలు, బేకరీలు, మిల్క్ సెంటర్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు దుకాణదారులకు మొత్తం రూ.2,500 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులను వినియోగించాలని కోరారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

