హార్దిక్ రీఎంట్రీ.. ఆస్ట్రేలియా ‘ఏ’తో ఫైట్‌కు రెడీ!

కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ‘ఏ’తో జరగనున్న సిరీస్‌కు భారత ‘ఏ’ వన్డే జట్టును ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) చోటు దక్కింది. అయితే అతడి ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై ఆసక్తి నెలకొంది. వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కెప్టెన్‌గా, దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, ప్రియాంశ్ ఆర్య, నిశాంత్ సింధు, అర్షిన్ కులకర్ణి, నమన్ ధీర్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. మల్టీడే జట్టుకు దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

పుదుచ్చేరిలో సిరీస్

ఆస్ట్రేలియా ‘ఏ’తో భారత్ ‘ఏ’ రెండు మల్టీడే మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. మొత్తం సిరీస్ పుదుచ్చేరిలోనే జరగనుంది. తొలి మల్టీడే మ్యాచ్ సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. మూడు వన్డేలు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. హార్దిక్ పాండ్యా ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉండటంతో, ఈ సిరీస్ ద్వారా అతడు తిరిగి మైదానంలోకి వస్తాడా అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>