కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం (EVM Warehouse) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలోని వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్.. గోదాం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరును కూడా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రతను కొనసాగించాలని సూచించారు. అగ్నిప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన అగ్నిమాపక వ్యవస్థను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

