కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు మరణాన్ని కోరుకుంటున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar)పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, వెంటనే అరెస్టు చేయాలని సిద్దిపేట అర్బన్ మండల బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గురువారం పోలీస్ స్టేషన్కు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసు అధికారులకు తమ ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయి ఉండి, తెలంగాణను సాధించిన సీనియర్ నాయకుడి చావును కోరుకోవడం అత్యంత దారుణమని, సమాజంలో హింసను ప్రేరేపించేలా ఇటువంటి వ్యాఖ్యలు ఉన్నాయని వారు మండిపడ్డారు.
Also Read : కేసీఆర్పై మాకు గౌరవం ఉంది: టీపీసీసీ చీఫ్!
Follow Us On: Instagram

